హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంట నష్టపోయిన రైతుకు అండగా ఉంటాం: బోథ్ MLA

ADB: భీంపూర్ మండలంలోని పిప్పల్ కోటి గ్రామానికి చెందిన రైతు షేక్ జావీద్ పొలంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో 10 ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న బోథ్ MLA అనిల్ జాదవ్ పంట పొలాన్ని గురువారం సందర్శించి రైతును పరామర్శించారు. తక్షణ సాయంగా రూ.20 వేల నగదు అందజేసి, ప్రభుత్వ పరంగా నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.