హైదరాబాద్: 28°C
తెలంగాణ

హెచ్ఐవి నియంత్రణలో మహబూబ్ నగర్ జిల్లాకు గుర్తింపు

MBNR: హెచ్ఐవి నియంత్రణలో మహబూబ్ నగర్‌కు సురక్షిత్ జిల్లా గుర్తింపు లభించిందని కలెక్టర్ కుష్బూ గుప్తా వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన 20 జిల్లాలలో మహబూబ్నగర్‌కు స్థానం లభించడం గొప్ప విషయం అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు గుర్తింపు రావడం వెనక కృషిచేసిన ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నామన్నారు.