KMR: బాన్సువాడలోని తిరుమల రైస్ షాప్ వద్ద ప్రత్యేక సన్న బియ్యం విక్రయ కేంద్రాన్ని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రారంభించారు. సామాన్యులకు తక్కువ ధరలకే నాణ్యమైన బియ్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రేషన్ కార్డుదారులతో పాటు అల్పాదాయ వర్గాల వారు కూడా కొనుగోలు చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, పౌరసరఫరాల అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
బాన్సువాడలో ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రం ప్రారంభం


