SRPT: సూర్యాపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఈ రోజు బాలెంల గ్రామ భూ బాధితులు ఆందోళనకు దిగారు. సర్వే కోసం వచ్చి దరఖాస్తుదారులను కలవకుండా, భూములు కొలవకుండా వెనుదిరిగారని మండిపడ్డారు. గ్రామ పెద్దమనుషులతో తహసీల్దార్ కుమ్మక్కయ్యారని బాధితులు ఆరోపించారు. సుమారు 50 మంది బాధితులు ఎమ్మార్వోతో వాగ్వాదానికి దిగి తమ నిరసన వ్యక్తం చేశారు.
తెలంగాణ
VIDEO: భూ సర్వే చేయలేదని ఎమ్మార్వో కార్యాలయం ముట్టడి


