హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ

KMM: జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు నిర్మాణ NGO సౌజన్యంతో జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఈనెల 21న ఉచిత నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎన్.మాధవి తెలిపారు. ఖమ్మం మోడల్ కెరీర్ సెంటర్ ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో ఉదయం 11గంటలకు మొదలయ్యే ఈ శిక్షణకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.