NZB: మండలంలో నూతనంగా మంజూరైన 442 పింఛన్లతో పాటు, పాత పింఛన్లలో మార్పులు, చేర్పుల ద్వారా మరో 62 మందికి లబ్ధి చేకూరింది. గురువారం ఎం.ఎన్. ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి పాల్గొని మొత్తం 504 మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. లబ్ధిదారులు సంతోషించారు.
తెలంగాణ
సిరికొండలో కొత్తగా 442 మందికి పింఛన్లు


