హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 21న మెగా జాబ్ మేళా

కరీంనగర్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 21న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా జరగనుంది. ఫోన్‌పే, వరుణ్ మోటార్స్ సంస్థల్లో 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదో తరగతి నుంచి బీటెక్ వరకు అర్హత ఉన్న అభ్యర్థులు విద్యార్హత ధ్రువపత్రాలతో కలెక్టరేట్‌లోని ఐడీఓసీ రెండో అంతస్తు, గది నంబర్ 202లో హాజరుకావాలని జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు సూచించారు.