హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళలు ఆర్థికంగా ఎదగడమే కాంగ్రెస్ లక్ష్యం

WGL: నెక్కొండ మండలంలోని గుట్లకొండ తండాలో నూతన మహిళా సంఘం భవనాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు. మహిళలు ఆర్థికంగా ఎదిగి, స్వయం సమృద్ధి సాధించి గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలనేదే కాంగ్రెస్ లక్ష్యమని అన్నారు. ఇందిరాగాంధీ జయంతి రోజున భవనం ప్రారంభించడం సంతోషమని, ఆమె సేవలు చిరస్మరణీయమని తెలిపారు.