హైదరాబాద్: 28°C
తెలంగాణ

మల్టీపర్పస్ వర్కర్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష

నిర్మల్ జిల్లా జాతీయ ఆయుష్ మిషన్ కింద జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మల్టీపర్పస్ వర్కర్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈనెల 21న ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లోని ఐడీఓసీ కార్యాలయంలో పరీక్ష ఉంటుందని జిల్లా ఆయుష్ నోడల్ అధికారి తెలిపారు. అర్హులైన అభ్యర్థులు సమయానికి హాజరుకావాలని సూచించారు.