హైదరాబాద్: 28°C
తెలంగాణ

C.M సభా ప్రాంగణంలో ప్రకృతి ప్రకంపనలు

సిద్దిపేట పట్టణంలో సీఎం సభా ప్రాంగణంలో వీచిన బలమైన ఈదురుగాలులకు గాలిదుమారం ఏర్పడింది. దీంతో సభ కోసం ఏర్పాటు చేసిన కటౌట్లు, ప్లెక్సీలు, హోర్డింగ్‌లు విరిగిపడి కిందపడ్డాయి. ఒక్కసారిగా వీచిన గాలులతో ప్రచార సామగ్రి చెల్లాచెదురుగా పడిపోయింది. ఈ ఘటనతో సభా ప్రాంగణంలో కొంతసేపు గందరగోళం నెలకొంది.