హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింధూరం లేని ప్రాచీన హనుమాన్ విగ్రహం..!

KNR: రామడుగు మండలం కొక్కెరకుంటలోని హనుమాన్ ఆలయంలో స్వామివారి విగ్రహానికి చందనం, సింధూరం లేకపోవడం విశేషంగా నిలుస్తోంది. ఇది అత్యంత ప్రాచీన ఆలయమని, తమ తాతల కాలం నుంచే ఇదే విధంగా పూజలు నిర్వహిస్తున్నామని గ్రామస్థులు తెలిపారు. ఇటీవల కొండగట్టులో 60 ఏళ్లకు చందనం తొలగిస్తున్న నేపథ్యంలో, తమ ఊరి హనుమంతుడి విగ్రహ ప్రత్యేకతపై గ్రామంతో పాటు జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.