హైదరాబాద్: 28°C
తెలంగాణ

రీ-సర్వే అభ్యంతరాలను పరిష్కించాలి: అదనపు కలెక్టర్

WNP: పెబ్బేరు మండలంలోని బూడిదపాడు, యాపర్ల గ్రామాల్లో భూముల రీ-సర్వే ప్రక్రియను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ గురువారం పరిశీలించారు. రీ-సర్వేలో రైతుల అభ్యంతరాలు, క్లెయిమ్‌లను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గడువులోగా సర్వే పూర్తి చేయాలని సూచించారు. అనంతరం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఏర్పాట్లను పరిశీలించారు.