హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఛాంబర్ ఎన్నికలపై బీఆర్ఎస్ ఆరోపణ

BDK: భద్రాచలం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలను న్యాయబద్ధంగా నిర్వహించాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి రావులపల్లి రాంప్రసాద్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. పదేళ్లుగా ఎన్నికలు అనిశ్చితిలో ఉన్నాయని, గుర్తుల కేటాయింపు వేళ కొందరిని తొలగించారని ఆరోపించారు. సభ్యత్వ నమోదులో అవకతవకలు జరిగాయని, ఎన్నికల కమిటీ నిబంధనలు ఉల్లంఘించిందని విమర్శించారు. వ్యాపార వర్గాలు ఐక్యంగా ఉండాలని కోరారు.