KMM: ముదిగొండ విశాల సహకార పరపతి సంఘం ద్వారా గేదెల డెయిరీ, ఇంటి నిర్మాణానికి రుణాలు మంజూరు చేస్తున్నట్లు గురువారం సొసైటీ ఛైర్మన్ తుపాకుల యలగొండ స్వామి తెలిపారు. పట్టాదారు పాసుపుస్తకం కలిగిన రైతులు, ప్రజలు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇంటి రుణానికి ఎకరానికి రూ.10 లక్షలు, గేదెల డైరీ రుణానికి ఎకరానికి రూ.5 లక్షల చొప్పున మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
గేదెల డెయిరీ, ఇంటి రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం


