MDK: సొంత ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దివ్యాంగుడు గట్ల శ్రీనివాస్ తహసీల్దార్ కార్యాలయంలో అధికారులకు తన గోడు వెళ్లబోసుకున్నారు. నాలుగో వార్డు బీసీ కాలనీకి చెందిన ఆయన ప్రమాదంలో కాలు కోల్పోయి, వైద్య ఖర్చుల కోసం ఉన్న ఇంటిని సైతం అమ్ముకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజావాణిలో కలెక్టర్, ఆర్డీఓలకు విన్నవించినా ఫలితం లేదని తెలిపారు.
తెలంగాణ
ఇల్లు లేక దివ్యాంగుడి అవస్థలు


