హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెరువు కట్ట వద్ద బీజేపీ ధర్నా

BHNG: భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పూర్ చెరువుకట్ట వద్ద ప్రమాదకర మలుపులో రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ బీజేపీ నేతలు గురువారం ధర్నా చేశారు. గంటపాటు సాగిన నిరసనతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రమాద మరణాలపై ఎమ్మెల్యే స్పందించడం లేదని నినాదాలు చేశారు. పనులు ప్రారంభించకుంటే వంటావార్పు చేస్తామని హెచ్చరించారు. ఎస్సై జగన్ సిబ్బందితో వచ్చి ఆందోళన విరమింపజేశారు.