BHPL: పలిమేల మండలంలోని బోడాయిగూడెం గ్రామంలో పోలీసులు అక్రమ గుడుంబా తయారీపై దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తి ఇంటి వెనుక పత్తి చేను వద్ద నిల్వ ఉంచిన 250 లీటర్ల బెల్లం పానకాన్ని గుర్తించి ధ్వంసం చేశారు. నాలుగు లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ తయారీ, విక్రయాలపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని ఎస్సై టి. సాయి శశాంక్ హెచ్చరించారు.
తెలంగాణ
అక్రమ గుడుంబా తయారీపై పోలీసుల దాడి


