హైదరాబాద్: 28°C
తెలంగాణ

దళారులకు ధాన్యం వద్దన్న ఎమ్మెల్యే

MNCL: జన్నారం మండలం పొనకల్ రైతు వేదికలో గురువారం జరిగిన సభలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ చేయూత పింఛన్ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. మార్కెట్ యార్డులో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి, రైతులు తెచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేయాలని అధికారులను ఆదేశించారు. దళారులకు అమ్మి నష్టపోవద్దని సూచించారు. కేంద్ర నిర్వహణ మహిళలకు అప్పగించడం సంతోషకరమన్నారు.