JGL: జగిత్యాల పట్టణంలోని 2వ వార్డులో చెత్త వాహనాలు రాక వీధుల్లో చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తుందని పట్టణ బీజేపీ నాయకులు మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్ కు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దోమలు, ఈగలు పెరిగి చిన్నపిల్లలు,వృద్ధుల ఆరోగ్యానికి హాని కలుగుతుందని తెలిపారు. వెంటనే పారిశుద్ధ్య చర్యలు చేపట్టి సమస్యలను పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని కమిషనర్‌కు వినతి


