హైదరాబాద్: 28°C
తెలంగాణ

శంకర్‌పల్లిలో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి

RR: శంకర్‌పల్లి ఏఎంసీ కార్యాలయంలో గురువారం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ గోవిందమ్మ గోపాల్ రెడ్డి, వైస్ ఛైర్మన్ చంద్రమోహన్, పీఏసీఎస్ ఛైర్మన్లు వెంకట్ రెడ్డి, సత్యం, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.