హైదరాబాద్: 28°C
తెలంగాణ

మైనారిటీ యువతకు ఉచిత పోటీ పరీక్షల శిక్షణ

భూపాలపల్లి జిల్లాలోని మైనారిటీ నిరుద్యోగ యువతకు గ్రూప్‌-2, గ్రూప్‌-3 పరీక్షల కోసం ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కుమారస్వామి అసోడ వెల్లడించారు. డిగ్రీ పూర్తి చేసిన అర్హులైన అభ్యర్థులు ఈనెల 26లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 27 నుంచి శిక్షణ ప్రారంభం కాగా, మొత్తం 100 మందికి అవకాశం కల్పించనున్నారు.