హైదరాబాద్: 28°C
తెలంగాణ

మూడు గ్రామాల్లో అంగన్వాడీ భవనాలు ప్రారంభించిన ఎమ్మెల్యే

BHPL: టేకుమట్ల మండలంలోని సుబ్బక్కపల్లి, పంగిడిపల్లి, రాఘవరెడ్డిపేట గ్రామాల్లో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్ర భవనాలను గురువారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణులు, చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందించాలని, పిల్లల తొలి విద్యాభివృద్ధిలో అంగన్వాడీ టీచర్లు కీలక పాత్ర పోషించాలని సూచించారు.