హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

MDCL: భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్, ఎల్లమ్మబండలోని ఆమె విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. విగ్రహానికి పూలమాలలు వేసిన స్థానిక నాయకులు అనంతరం ప్రజలకు పండ్లు పంపిణీ చేశారు. దేశ ఐక్యత, సామాజిక న్యాయం కోసం ఆమె చేసిన సేవలు, చూపిన ధైర్యం నేటి తరానికి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని నాయకులు కొనియాడారు.