హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైద్య బృందాన్ని సన్మానించిన ఎమ్మెల్యే పాయం

BDK: మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు స్ట్రోక్ బాధితురాలికి సకాలంలో చికిత్స అందించి కోలుకునేలా చేశారు. రజనీ (29) అనే మహిళకు భద్రాచలం ఆసుపత్రిలో గోల్డెన్ అవర్‌లో టెనెక్టెప్లేస్ ఇంజెక్షన్‌తో చికిత్స అందించారు. దీంతో ఆమె ఆరోగ్యం మెరుగుపడింది. ఈ సందర్భంగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వైద్య బృందాన్ని శాలువాలతో సత్కరించి అభినందించారు.