MDK: SIగా పరిచయం చేసుకున్న సైబర్ నేరగాళ్లు ఓ వ్యక్తిని మోసం చేసిన ఘటన గురువారం మధ్యాహ్నం టేక్మాల్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సయ్యద్ ఆరీఫ్‌కు టేక్మాల్ ఎస్ఐ పేరుతో ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు వివిధ కారణాలు చెబుతూ ఆయన నుంచి రూ.20 వేల నగదును కాజేశారు. అనంతరం బాధితుడు విచారించగా, తాను మోసపోయినట్లు గుర్తించాడు. దీంతో ఆరీఫ్ టేక్మాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తెలంగాణ
ఎస్ఐ పేరుతో ఫోన్.. రూ.20 వేల కాజేత


