MHBD: కొత్తగూడ మండల కేంద్రంలో కొమురం భీం భవన్ నిర్మాణానికి గురువారం సర్పంచ్ మల్లెల భాగ్యమ్మ భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఈ భవనం గిరిజనుల సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ఉపయోగపడుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బానోత్ రూప్ సింగ్, వజ్జ సారయ్య, ఆదివాసి సంఘం నాయకులు తదితరులు ఉన్నారు.
తెలంగాణ
కొమురం భీం భవన్ నిర్మాణానికి భూమిపూజ


