హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళా సమైక్య భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

BDK: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెంది స్వయం సమృద్ధి సాధించేందుకు మహిళా సమైక్య భవనాలు ఎంతగానో ఉపయోగపడతాయని MLA జారే ఆదినారాయణ అన్నారు. గురువారం దమ్మపేట మండలంలోని గండుగులపల్లి, శ్రీరాంపురం గ్రామాల్లో మహిళా సమైక్య భవనాలను ఆయన ప్రారంభించారు. ఈ భవనాలు డ్వాక్రా మహిళల సమావేశాలు, పొదుపు, రుణాలు, స్వయం ఉపాధి కార్యక్రమాలకు శాశ్వత వేదికలుగా నిలుస్తాయని పేర్కొన్నారు.