హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

KNR: చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల (యూపీఎస్) ఆవరణలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్ర భవనాన్ని చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రం చిన్నారుల విద్య, ఆరోగ్యం అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని, చిన్నారులను అంగన్వాడీ కేంద్రంలో చేర్పించాలని ఎమ్మెల్యే అన్నారు.