హైదరాబాద్: 28°C
తెలంగాణ

కమిషనర్‌గా శ్రీజారెడ్డి బాధ్యతల స్వీకరణ

NLG: నగరపాలక సంస్థ ఇన్‌ఛార్జి కమిషనర్‌గా శ్రీజారెడ్డి గురువారం బాధ్యతలు చేపట్టారు. సొంత నగరంలో పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, నగరాభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ విధులు నిర్వహిస్తానని పేర్కొన్నారు. అధికారులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. పారిశుధ్యంపై దృష్టి పెడతానని చెప్పారు.