హైదరాబాద్: 28°C
వార్తలు

రోడ్ల నాణ్యతలో రాజీపడే ప్రసక్తే లేదు: గడ్కరీ

TG: రోడ్డు నిర్మాణ టెక్నాలజీలో IRC కీలక పాత్ర పోషిస్తోందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రోడ్ల నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని అన్నారు. క్వాలిటీ, టైమ్‌బౌండ్, కరప్షన్ ఫ్రీ విధంగా రోడ్ల నిర్మాణం జరగాలన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం పూర్తి కావాలన్నది మోదీ లక్ష్యమని పేర్కొన్నారు. రోడ్లు బాగుండే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని వెల్లడించారు.