హైదరాబాద్: 28°C
తెలంగాణ

'క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలి'

ADB: క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు పేరు తేవాలని మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష ఆకాంక్షించారు. గురువారం పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఆర్చరీ, అథ్లెటిక్స్ పోటీల్లో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గిరిజన యువతలో ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయని పేర్కొన్నారు.