హైదరాబాద్: 28°C
తెలంగాణ

భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక తీర్థయాత్రలు

KMR: భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా హైదరాబాద్ నుంచి మూడు ప్రత్యేక తీర్థయాత్ర ప్యాకేజీలు ప్రారంభించనున్నట్లు ఐఆర్‌సీటీసీ టూరిజం అసిస్టెంట్ మేనేజర్ పీవీ వెంకటేష్ గురువారం తెలిపారు. 2026 డిసెంబర్ 5 నుంచి 2027 జనవరి 3 వరకు యాత్రలు నిర్వహించనున్నట్లు కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.