చెన్నైలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. నగర శివారులోని మాధవరంలో రూ.140 కోట్ల విలువైన 70 కిలోల హెరాయిన్‌ను DRI అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన ఓ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా.. అందులో 17 ప్యాకెట్లలో దాచిన హెరాయిన్ బయటపడింది. ఈ డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో మరెవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
వార్తలు
రూ.140 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత


