హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వారానికి ఒక్కరోజే ఆరోగ్య ఉప కేంద్రం

SRD: కంగ్టి మండలం తుర్కవడ్గంలోని ఆరోగ్య ఉప కేంద్రం వారానికి ఒకరోజు మాత్రమే తెరుచుకుంటుందని, మిగతా రోజుల్లో పూర్తిగా మూసి ఉంచుతున్నారని గ్రామస్థులు గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర సమయంలో కనీసం ఒక మాత్ర, ఇంజక్షన్ కూడా దొరకడం లేదని, గర్భిణులు, మహిళలు వైద్య సేవల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించాలని కోరారు.