హైదరాబాద్: 28°C
వార్తలు

భారత్ సరికొత్త ఆట ఆడుతోంది: మోదీ

ప్రపంచవ్యాప్తంగా 'గ్రాండ్ థెప్ట్ ఆటో-జీటీఏ గేమ్6' విడుదల నేపథ్యంలో ప్రధాని మోదీ ఆసక్తికర పోస్ట్ చేశారు. GTA-5, GTA-6 విడుదల మధ్య ఉన్న 13 ఏళ్ల కాలాన్ని ప్రస్తావిస్తూ.. ఈ సమయంలో భారత్ సాధించిన అభివృద్ధిని ఆయన వివరించారు. ఆర్థిక వృద్ధి, పేదరిక నిర్మూలన, డిజిటల్ చెల్లింపులు, అంతరిక్ష విజయాలు వంటి అంశాలను గ్రాఫిక్ చిత్రాల రూపంలో పంచుకున్నారు. 'భారత్ ఇప్పుడు సరికొత్త ఆట ఆడుతోంది' అంటూ క్యాప్షన్ ఇచ్చారు.