JGL: కథలాపూర్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి గురువారం ప్రారంభించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అందించే మద్దతు ధరను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్లు గడ్డం స్వామిరెడ్డి, ముబీన్, సర్పంచ్ శేఖర్, ఉపసర్పంచ్ ఉన్నారు.
తెలంగాణ
కథలాపూర్లో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం


