MBNR: పట్టణంలోని బీకే రెడ్డి కాలనీకి చెందిన నాగులపల్లి లక్ష్మీనర్సు (49) ఈ నెల 9వ తేదీన అదృశ్యమయ్యారు. పరిసర ప్రాంతాలతో పాటు వనపర్తి, మహబూబ్నగర్ (ఎంబీఎన్ఆర్) ప్రాంతాల్లో వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. ఆమెకు మతిస్థిమితం సరిగా లేదని, ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు భర్త వెంకటయ్య తెలిపారు.
తెలంగాణ
మహిళ అదృశ్యం


