హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆహార భద్రత కార్డుదారులకే కుటుంబ బీమా అవకాశం'

NZB: ప్రభుత్వం ప్రవేశపెడుతున ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి ఆహార భద్రత కార్డు ఉన్నవారికే అవకాశం కల్పించినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఎక్కడి నుంచైనా వివరాలు నమోదు చేసుకోవచ్చని, కార్డు నంబర్ ఆధారంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసిన అనంతరం బీమా చేసుకున్న వ్యక్తి ఫోన్‌కు సమాచారం వస్తుందని వెల్లడించారు.