హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్ర స్థాయి నెట్ బాల్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

ASF: రాష్ట్రస్థాయి SGF అండర్-19 నెట్ బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలుర జట్టు రజత పతకం సాధించింది. మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన పోటీల్లో కాగజ్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు సుశీల్ కుమార్, వరుణ్ సందేశ్ ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా హెచ్ఎం హదియ బేగం, పీఈటీ బాలాజీ, ఉపాధ్యాయులు విద్యార్థులను ఘనంగా సన్మానించి అభినందించారు.