హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ సేవలను స్మరించుకున్న కాంగ్రెస్ శ్రేణులు

BHPL: చిట్యాల మండల కేంద్రంలో ఇందిరాగాంధీ 109వ జయంతిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు దబ్బెట అనిల్ కేక్ కట్ చేసి, చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ ఐక్యత, పేదల సంక్షేమానికి ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పింగిలి జ్యోతి, గుమ్మడి శ్రీదేవి, సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.