ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు ఆర్థిక ప్రయోజనం కలిగించేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత పీఎఫ్ మొత్తాన్ని ఒకేసారి తీసుకోకుండా విడతల వారీగా విత్‌డ్రా చేసుకునేలా 'సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్'ను ప్రతిపాదించింది. దీనివల్ల మిగిలిన మొత్తంపై వడ్డీ పొందే అవకాశం ఉంటుంది. ఈ ప్రతిపాదనపై ఇవాళ జరగనున్న సీబీటీ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
వార్తలు
EPF రిటైర్మెంట్ విత్‌డ్రా.. మరింత సులభంగా!


