ELR: జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజల్లో కలకలం రేపుతోంది. గత కొన్ని నెలలుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో సంచరిస్తున్న పెద్దపులి తాజాగా ముసునూరు మండలం రమణక్కపేట పరిసర ప్రాంతాలకు చేరుకుంది. రమణక్కపేటలోని తేలకలమ్మ గట్టుపై పెద్దపులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. రైతులు, కూలీలు ఎవరూ ఒంటరిగా పొలం పనులకు వెళ్లొద్దని సూచించారు. పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
రమణక్కపేటలో పెద్ద పులి సంచారం


