హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజల సమస్యలపై వినతులు స్వీకరించిన పల్లా

GNTR: మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వినతులు స్వీకరించారు. ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం పార్టీ కార్యాలయంలో జరిగిన బ్యాక్ ఆఫీస్ సమావేశంలో గాజువాక ఎమ్మెల్యే పల్లా పాల్గొన్నారు.