అనకాపల్లి: బుచ్చయ్యపేట మండలం కొమల్లపూడికి చెందిన గేదెల సత్యనారాయణ, గేదెల సత్యవతి దంపతులు పదవులు చేపట్టారు. గేదెల సత్యనారాయణ ఎంపీపీగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనుండగా, గేదెల సత్యవతి సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా దంపతులు మాట్లాడుతూ.. తమను గెలిపించిన ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటామని గ్రామ, మండల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బుచ్చయ్యపేటలో ఒకే కుటుంబానికి రెండు పదవులు


