ATP: సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద టీడీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. మండల పరిధిలో ఎంపీపీ స్థానం కేటాయించే విషయంలో ఎమ్మెల్యే మాట తప్పారంటూ టీడీపీ నేతలు ఇంటి ముందు బైఠాయించారు. మొదట మండల MPP స్థానం MPTCగా గెలుపొందిన తులసికి కేటాయిస్తానని హామీ ఇచ్చి, చివరి నిమిషంలో నిదనవాడకు చెందిన ఎంపీటీసీ హరితకు కేటాయించేలా నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
బండారు శ్రావణి ఇంటి వద్ద టీడీపీ నాయకుల ధర్నా


