అన్నమయ్య: చిట్వేలి మండలంలో కోఆప్షన్ సభ్యుని ఎన్నికను ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది. ఈ విషయాన్ని చిట్వేలి ఎన్నికల అధికారి జయ భరత్ రెడ్డి వెల్లడించారు. కోఆప్షన్ సభ్యుని ఎన్నికకు సంబంధించిన కొత్త తేదీని త్వరలోనే ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుందని ఆయన తెలిపారు. అయితే ఇవాళ మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుడి ఎన్నిక మాత్రం యథాతథంగా జరుగుతుందని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
చిట్వేలి మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుని ఎన్నిక వాయిదా


