KDP: బద్వేలులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శేఖర్ థియేటర్ ఎదురుగా ఉన్న షాపుల్లో ఈరోజు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా పక్క షాపులకు కూడా వ్యాపిస్తుండటంతో స్థానిక వ్యాపారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
బద్వేలులో భారీ అగ్నిప్రమాదం


