హైదరాబాద్: 28°C
తెలంగాణ

మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్

MHBD: వివిధ ఫిర్యాదులు, విపత్కర సమయాల్లో సహాయం కోసం తొర్రూరు పోలీస్ స్టేషన్‌కు వచ్చే అవసరార్థులకు స్థానిక పోలీస్ కానిస్టేబుల్ రవీందర్ ఆకలి తీరుస్తూ.. మానవత్వం చాటుకుంటున్నాడు. ఈ సందర్భంగా కానిస్టేబుల్‌ను సీఐ గణేష్, ఎస్సై మహేందర్ రెడ్డి అభినందించారు. ఆపదలో ఉన్న పేదలకు అండగా నిలవడం అభినందనీయమని వారు తెలిపారు.