హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలికపై అఘాయిత్యం..పోక్సో కేసు నమోదు

GNTR: తాడేపల్లిలో ఓ బాలికపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడి గర్భవతిని చేసిన యువకుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన యువకుడు తాడేపల్లిలో నివాసముంటూ బాలికపై దారుణానికి ఒడిగట్టాడు. బాలిక అస్వస్థతకు గురవ్వడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా గర్భవతి అని తేలింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.