NRPT: నల్లమల ప్రాంతంలోని తూర్పు పొడజాతి పశువుల పరిరక్షణపై వారం రోజుల్లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ జాతిని ఇప్పటికే 'తెలంగాణ గిత్త' గా ప్రకటించారు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలో పరిశోధన సంస్థ, పశువైద్య పాలిటెక్నిక్ కళాశాల కోసం సుమారు 100 ఎకరాల సేకరణ ప్రతిపాదన ఉంది. సీఎం నల్లమల పర్యటనలో ప్రకటించవచ్చని సమాచారం.
తెలంగాణ
తెలంగాణ గిత్త పరిరక్షణకు అడుగులు


